: 14న విశాఖలో భారత్, లంక మధ్య టీ20 మ్యాచ్... రేపటి నుంచి టికెట్ల అమ్మకం
భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా సాగర నగరం, నవ్యాంధ్ర ఎకనమిక్ కేపిటల్ విశాఖ కూడా ఓ మ్యాచ్ కు వేదిక కానుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 14న (చివరి టీ20) విశాఖలో జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు విశాఖ జాయింట్ కలెక్టర్ నివాస్ నేటి ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఎంపిక చేసిన 18 ఈ-సేవా కేంద్రాల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని జేసీ నివాస్ ప్రకటించారు. జేసీ ప్రకటన ప్రకారం... రేపటి నుంచి రూ.300, రూ.600 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎల్లుండి నుంచి రూ.1,000, రూ.1,500, రూ.2.000, రూ.3,000 టికెట్ల విక్రయం మొదలు కానుంది.