: ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నన్నపనేని ప్రమాణ స్వీకారం
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నన్నపనేని రాజకుమారి పదవీ బాధ్యతలు చేపట్టారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో కొద్దిసేపటి క్రితం ఆమె పదవీ ప్రమాణం చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలోని పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఈ క్రమంలో పార్టీకి చెందిన మహిళా నేతల్లో కీలక నేతగా ఉన్న నన్నపనేని రాజకుమారికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. పది రోజుల క్రితమే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినా, నేటి ఉదయం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.