: ఈసారి రివర్స్... న్యూహంప్ షైర్ లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు, హిల్లరీ క్లింటన్ ఓటమి
అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగాల్సిన వారెవరో నిర్ణయించే ప్రాథమిక ఎన్నికల్లో తొలిసారిగా రిపబ్లికన్ సెనెటర్, వివాదాస్పద వ్యాఖ్యల డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని సాధించారు. ఇటీవలి అయోవా ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన, న్యూహాంప్ షైర్ లో ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, డెమొక్రటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ ఇక్కడ వెనుకంజ వేశారు. హిల్లరీపై ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ భారీ విజయం సాధించారు. తాను ఓటమిని అంగీకరిస్తున్నానని, తదుపరి సౌత్ కరోలినా, నెవాడా రాష్ట్రాల్లో ప్రచారంపై దృష్టిని సారిస్తానని ఆమె తెలిపారు. కాగా, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ తో పాటు ట్రెడ్ క్రూజ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.