: సమాజ్ వాదీ- శివసేన మధ్య ముదిరిన వివాదం...ముంబై వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం


పాకిస్థాన్ కు చెందిన సంగీతకారుడు గులాంఅలీ కచేరీ శివసేన, సమాజ్ వాదీ పార్టీ మధ్య పెను వివాదం రాజేసింది. దీంతో ఈ రెండు పార్టీలు ముంబై వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. గులాం అలీ కచేరీని ముంబైలో నిర్వహించకుండా శివసేన అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కచేరీని ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సిద్ధమైన శివసేన కార్యకర్తలను అరెస్టులు చేసింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో భారత్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇస్లామిక్ స్టేట్ లా మారిందని శివసేన ఆరోపించింది. 'ములాయం సింగ్ యాదవ్, ఇస్లామిక్ యాదవ్ లా మారారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సమాజ్ వాదీ పార్టీ దీనికి నిరసనను, శివసేనకు పట్టున్న ముంబైలో తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో ఈ నెల 16న 'దేశ్ బనావో...దేశ్ బచావో' పేరుతో సమాజ్ వాదీ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించనుందని ఆ పార్టీ చెబుతోంది. ఈ సందర్భంగా నిర్వహించే సభాస్థలి నుంచి శివసేన వ్యాఖ్యలకు ములాయం సమాధానం చెబుతారని ఆ పార్టీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News