: తెలంగాణ మంత్రితో బాలయ్య భేటీ... లేపాక్షి ఉత్సవాలకు రావాలంటూ ఆహ్వానం


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తో భేటీ అయ్యారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తన సొంత నియోజకవర్గం హిందూపురంలో త్వరలో లేపాక్షి ఉత్సవాల పేరిట భారీ కార్యక్రమానికి బాలయ్య సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున కార్యక్రమానికి సన్నాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని బాలయ్య... చందూలాల్ కు ఆహ్వానం పలికారు. బాలయ్య ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన చందూలాల్... తప్పనిసరిగా లేపాక్షి ఉత్సవాలకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News