: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి అదనపు శాఖ
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రభుత్వం అదనపు శాఖను కేటాయించింది. ఎస్సీ డెవలప్ మెంట్ అండ్ కో-ఆపరేటివ్ శాఖను కూడా ఆయనకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వం మున్సిపల్ శాఖను కూడా అదనంగా కేటాయించిన సంగతి తెలిసిందే.