: బాలీవుడ్ అవార్డులు ఎందుకూ పనికిరావు: ఇర్ఫాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు


బాలీవుడ్ లో అవార్డుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో అవార్డులు గెల్చుకున్నవారు...తమ జీవితం చరితార్ధకమైందని...ఈ స్టేజ్ పై అవార్డు తీసుకోవడం తన కల అని...ఈ క్షణాలు తన జీవితంలో అంత్యంత ఆనందకరమైనవని కన్నీరొలుకుతూ పేర్కొనడం టీవీల్లో చూస్తునే ఉంటాం. అయితే ఈ అవార్డులు ఎందుకూ పనికిరానివని ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డుల వల్ల నటులకు పేరు ప్రఖ్యాతులు, డబ్బులు, ఆఫర్లు ఇలా ఏవీ రావని ఇర్ఫాన్ ఖాన్ తెలిపాడు. అదే హాలీవుడ్ లో అకాడమీ అవార్డు కానీ, గ్లోబల్ అవార్డు కానీ తీసుకుంటే ఆ నటుడి కెరీర్ అమాంతం పెరిగిపోతుందని పేర్కొన్నాడు. అద్భుతమైన ఆఫర్లు తలుపుతడతాయని చెప్పాడు. రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందని అన్నాడు. బాలీవుడ్ అవార్డులు మాత్రం ఎందుకూ పనికిరావని స్పష్టం చేశాడు. గతంలో రిషి కపూర్ బాలీవుడ్ అవార్డుల గురించి మాట్లాడుతూ, తమ ఇంటి డోర్ స్టాపర్లుగా వాటిని వాడతామని కామెంట్ చేసిన సంగతి చాలా మందికి గుర్తుండే వుంటుంది.

  • Loading...

More Telugu News