: ప్రియాంకా చోప్రా సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవాలి: కత్రినా కైఫ్


ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ 'ఫితూర్' సినిమా ప్రమోషన్ లో దూసుకుపోతోంది. తనదైన శైలిలో 'ఫితూర్' ను కత్రినా ప్రమోట్ చేస్తోంది. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ, ప్రియాంకా చోప్రా సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఆరాటపడింది. రోజు 22 గంటల పాటు విమానంలో ప్రయాణిస్తూ హాలీవుడ్ లో ఎలా నటించగలుగుతోందో తెలుసుకోవాలని ఉందని పేర్కొంది. హాలీవుడ్ లో నటించాలంటే ఎంతో ధైర్యం, పట్టుదల, ఏకాగ్రత కావాలని; అవి తనలో ఉన్నాయని ప్రియాంక నిరూపించిందని కత్రినా తెలిపింది. దీనిమీద ప్రియాంక చోప్రా ఏకంగా ఓ పుస్తకం రాయాలని కత్రినా సూచించింది. కాగా, 'ఫితూర్' ఈ శుక్రవారం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News