: పార్టీ పిరాయింపులతో కేసీఆర్ కుటుంబంలో ముసలం పుడుతుంది: రేవంత్


తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీ పిరాయింపులను ప్రోత్సహించడంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మాధవరం కృష్ణారావును స్థలం వివాదంలో భయపెట్టి, ధర్మారెడ్డిని కాంట్రాక్టుల పేరుతో మచ్చిక చేసుకుని, తీగల కృష్ణారెడ్డిని కళాశాలల పేరుతో ఒత్తిడి తెచ్చి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని అన్నారు. తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ను అక్రమ కట్టడాల వివాదం, వ్యక్తిగత కుటుంబ తగాదాల నేపథ్యంలో పార్టీలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఇలా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించుకుంటూ పోతే, కేసీఆర్ కుటుంబంలో ఏదో ఒకరోజు ముసలం పుట్టడం ఖాయమని రేవంత్ స్పష్టం చేశారు. దాంతో భవిష్యత్తులో మీరు కూడా అవే పిరాయింపులతో బలవుతారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News