: బీసీలకు ఇబ్బంది లేకుండానే కాపులకు రిజర్వేషన్లు: ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ


కాపు రిజర్వేషన్ల కోసం కమిషన్ ఏర్పాటు చేయడంతో తమకు అన్యాయం జరుగుతోందంటూ బీసీలు గళమెత్తడంపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీసీలకు నష్టం లేకుండా ఉండాలనే కమిషన్ వేశామని అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, కమిషన్ నివేదిక కూడా బీసీలకు ఇబ్బంది లేకుండానే ఉంటుందని భరోసా ఇచ్చారు. అసలు బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం సీఎం చంద్రబాబుకు లేదని కాల్వ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News