: ఐఎస్ ఉగ్రవాదుల జీతాల్లో కోత...ఇతర సంస్థల్లోకి వలస!
ఐఎస్ఐఎస్ జిహాదీలు ఎక్కువ జీతాల కోసం ఇతర ఉగ్రవాద సంస్థలకు తరలివెళ్తున్నారు. ప్రస్తుతం వారు పనిచేస్తున్న సంస్థలో జీతాల కోత విధించిన కారణంగానే వేరే ‘ఉగ్ర’ సంస్థల్లోకి మారుతున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఐఎస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో ఉగ్రవాదుల జీతాల్లో కోత విధిస్తోందని, ఈ విషయమై అసంతృప్తిగా ఉన్న వారు మెరుగైన జీతాలిచ్చే సంస్థల్లోకి మారుతున్నారని పేర్కొంది. ఐఎస్ లో కొత్తగా చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోయిందని, ఆ సంస్థ తాజా ఓటములకు ఇది కూడా ఒక కారణమని ఐఎస్ వ్యవహారాల్లో నిపుణుడైన ప్రిన్స్ టన్ వర్శిటీ ప్రొఫెసర్ జాకోబ్ షాపిరోను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.