: సగం పని నాదే: ముంబై దాడులపై రెండో రోజు విచారణలో హెడ్లీ


అమెరికా జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముంబై దాడి కేసు నిందితుడు డేవిడ్ హెడ్లీని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెండవ రోజు ప్రత్యేక కోర్టు విచారించింది. విచారణలో భాగంగా హెడ్లీ పలు కీలకాంశాలను వెల్లడించాడు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన హెడ్లీ, "2007లోనే ముంబైపై దాడికి లష్కరే తోయిబా నిర్ణయించింది. తాజ్ హోటల్ రెక్కీ బాధ్యతలు నాకు అప్పగించింది. 2003లోనే జైషే మహమ్మద్ అధినేత మనూద్ అజహర్ ను నేను కలిశాను. అదే సమయంలో లక్వీ, మసూద్ లను కూడా కలిశాను. వారందరి లక్ష్యం ఒకటే. భారత ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో భయాన్ని సృష్టించడం. అందుకు సగం పని నేనే చేశాను" అని తెలిపాడు. 2003లో తన భార్య ఫైజా, అమెరికా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసిందని పేర్కొన్న హెడ్లీ, ఆపై తన మీద నిఘా పెరిగిందని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News