: నేడు లేదా రేపు... మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి!
తెలంగాణలో కేసీఆర్ హవా సాగుతుండటంతో, విపక్షంలో ఉంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అనుకున్నారో, ఏమో, మరో ముగ్గురు శాసనసభ్యులు టీఆర్ఎస్ లోకి జంప్ చేయబోతున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీరంతా గ్రేటర్ పరిధిలోని వారేనని తెలుస్తున్నప్పటికీ, ఎవరన్నది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. నేడు లేదా రేపు, వీరంతా సీఎంను ఆయన నివాసంలోనే కలిసి ఆపై టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటిస్తారని రాజకీయ నేతల్లో చర్చ సాగుతోంది. వీరిని చేర్చుకున్న తరువాతనే నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల ప్రచార సభకు కేసీఆర్ వెళ్తారని కూడా తెలుస్తోంది. ఇదే జరిగితే, జంటనగరాల్లో ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు ముందుండి నడిపించే నేతలు కరవవుతారు.