: ప్రేమ విఫలం... అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. భాను అనే యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, చివరికి చేసుకోలేకపోవడంతో డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న మాధవి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా తాను బలవన్మరణానికి పాల్పడడానికి దారి తీసిన కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసింది. తనకు జీవితం మీద ఆశలేదని, తానెవరికీ ఇబ్బందిగా మారాలని భావించడం లేదని ఆమె అందులో పేర్కొంది. తమ పెళ్లి విషయంలో భాను ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం ఇక లేదని ఆమె వీడియోలో తెలిపింది. భగవంతుడి దృష్టిలో తామిద్దరికీ ఎప్పుడో వివాహం జరిగిందని, ఈ జన్మకు అది చాలని ఆమె చెప్పింది. తనను ఎవరూ తప్పుపట్టవద్దని ఆమె కోరింది.