: అజ్జూ భాయ్ కి ఇమ్రాన్ హష్మి పుట్టినరోజు కానుక


టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ట్విట్టర్ మాధ్యమంగా ఓ కానుకను అందజేశాడు. 'నేడు 53వ పడిలోకి ప్రవేశించిన అజారుద్దీన్ కు పుట్టిన రోజు కానుక' అంటూ తన ఫోటోను పెట్టాడు. అజార్ కు ఇమ్రాన్ హష్మీ తన ఫోటో పంపితే అది కానుక ఎలా అవుతుందని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం...అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో అతని పాత్రను ఇమ్రాన్ హష్మి పోషిస్తున్నాడు. టెస్టు డ్రెస్ అయిన వైట్ జెర్సీ ధరించిన ఇమ్రాన్ హష్మి యువకుడైన అజారుద్దీన్ పోలికలతో నాటి అజ్జూ భాయ్ ని ఈ ఫోటో ద్వారా గుర్తు చేశాడు. ఈ పాత్ర కోసం ఇమ్రాన్ హష్మీ చాలా కష్టపడుతున్నాడు. రిస్ట్ తో ఆడే అజ్జూ భాయ్ స్టైల్ లో క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు.

  • Loading...

More Telugu News