: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న హైదరాబాదీ అరెస్టు


ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అజీజ్ అనే హైదరాబాద్ యువకుడ్ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి అతనికి ఈ నెల 19 వరకు రిమాండ్ విధించారు. దీంతో అజీజ్ ను కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తాజా అరెస్టుతో కొత్త సంవత్సరం ప్రారంభమైన తరువాత ఉగ్రవాదం పేరుతో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. కాగా, పఠాన్ కోట్ ఘటన అనంతరం దేశంలో ఉగ్రవాద మూలాలను సమూలంగా నాశనం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News