: గర్భిణులు చేపలు తింటే పిల్లల్లో ఐక్యూ పెరుగుతుంది


గర్భిణులు ప్రతి వారం ఆహారంలో తీసుకుంటే పుట్టే పిల్లల్లో ఐక్యూ పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం 2 వేల మంది తల్లీపిల్లల్ని లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇందులో చేపలు తినని తల్లులతో పోలిస్తే గర్భిణులుగా ఉన్నప్పుడు చేపలు ఆహారంగా తీసుకున్న పిల్లల్లో ఐక్యూ పెరిగిందని అన్నారు. మూడు నెలల గర్భంతో ఉన్నప్పుడు మొదలైన పరిశోధనలు పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకు సాగాయని వారు చెప్పారు. దీని ప్రకారం చేపలు ఆహారంగా తీసుకున్న పిల్లల్లో ఐక్యూ స్థాయి 2.8 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలిందని వారు వెల్లడించారు. అయితే ఈ చేపల్లో టూనా, టెయిల్ ఫిష్ లాంటి పాదరసం ఎక్కువగా కలిగిన చేపలను ఆహారంలో భాగం చేసుకోవద్దని వారు సూచించారు.

  • Loading...

More Telugu News