: ఈ నెల 11న గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 11న జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలో ఈ ఎన్నికను నిర్వహిస్తారు. ఇందుకోసం గ్రేటర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 99 స్థానాలు గెలుచుకున్న అధికారపార్టీ టీఆర్ఎస్ ఇప్పటివరకు మేయర్ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. కాగా, 150 మంది కార్పొరేటర్లు, 67 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ ఎన్నికలో పాల్గొంటారు.