: ఈఎస్ఐ ఆసుపత్రులను సూపర్ స్పెషాల్టీలుగా మారుస్తాం: బండారు దత్తాత్రేయ
ఈఎస్ఐ ఆసుపత్రులను సూపర్ స్పెషాల్టీలుగా మారుస్తామని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్మించనున్న ఈఎస్ఐ ఆసుపత్రుల వివరాలను ఆయన వెల్లడించారు. అమరావతిలో ఈఎస్ఐ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి, శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో 10, విజయనగరంలో 100, కాకినాడలో 100, విశాఖపట్టణంలో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఈ ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. తిరుపతిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.