: ఫ్రీ బేసిక్స్ కు ఎదురుదెబ్బ... నెట్ న్యూట్రాలిటీకే ట్రాయ్ ఆమోదం


ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్సా... నెట్ న్యూట్రాలిటీనా? అన్న ఊగిసలాటలో చివరికి భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఓ నిర్ణయానికి వచ్చింది. నెట్ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. దాంతో ఫేస్ బుక్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాగా, ఇంటర్నెట్ డేటాపై కంపెనీలన్నీ వివిధ రకాల ఛార్జీలను వసూలు చేయవద్దంటూ ట్రాయ్ ఆదేశించింది. ఇకపై ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే టెలికాం ఆపరేటర్లకు రోజుకు రూ.50వేల వరకు జరిమానా విధిస్తామని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ హెచ్చరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్నెట్ ప్యాకేజీలన్నీ వెంటనే రద్దవుతాయని తెలిపారు. డేటా ప్యాకేజీలన్నీ ఒకే రకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉచిత సేవలను టారిఫ్ పూర్తయ్యే వరకు వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News