: కూతురుకి కొత్తగా నామకరణం చేసిన జుకెర్ బర్గ్


ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ చైనాపై అవ్యాజమైన ప్రేమ కురిపించారు. చైనా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ తన కుమార్తెకు పేరు పెట్టారు. ఈ పేరును చైనీస్ భాషలోంచి ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. సుదీర్ఘ డేటింగ్ అనంతరం వివాహం చేసుకున్న జుకెర్ బర్గ్, ప్రిస్కిల్లా దంపతులకు గత నవంబర్ లో కుమార్తె పుట్టింది. పాప పుట్టగానే తర్జనభర్జనల అనంతరం భార్యాభర్తల పేర్లు కలిసి వచ్చేలా 'మ్యాక్స్' అని ముద్దు పేరు పెట్టారు. తాజాగా ఆ పాప అసలు పేరును 'చెన్ మింగ్ యూ'గా ప్రకటించారు. ఈ పేరులో 'చెన్' ను తన భార్య కుటుంబం పేరు కొనసాగింపుగా తీసుకున్నట్టు తెలిపారు. 'మింగ్ యూ' అంటే ఉజ్వలమైన భవిష్యత్ అని అర్ధం వస్తుందని జుకెర్ బర్గ్ తెలిపారు. చైనీయులంతా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన మాండరీన్ భాషలో తెలిపారు.

  • Loading...

More Telugu News