: 2016... మర్కట నామ సంవత్సరం... చైనా క్యాలెండర్ ప్రకారం మీరెంత లక్కీయో తెలుసుకోండి!


చైనాలో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆ దేశంలో చాంద్రమానాన్ని అనుసరించి ఈ సంవత్సరాన్ని మర్కటనామ సంవత్సరంగా పిలుచుకుంటున్నారు. భారత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉన్నట్టుగానే, చైనాలో పుట్టిన సంవత్సరాల ప్రకారం 12 జంతువులను సూచించే రాశులు ఉంటాయి. ఒకవేళ మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నట్లయితే, చైనా జ్యోతిష్యుల ప్రకారం, మీరు పుట్టిన సంవత్సరాన్ని బట్టి మీరెంత లక్కీయో వివరిస్తూ 'న్యూస్ డాట్ ఏబీఎస్-సీబీఎన్ డాట్ కామ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం... ఎలుక: 1924, 1936, 1948, 1960, 1972, 1984, 1996, 2008ల్లో పుట్టినవారికి... * ఈ సంవత్సరాల్లో పుట్టిన వారికి 2016లో వేతనాల పెంపు తప్పనిసరి. * ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. * ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కోతి: 1932, 1944, 1956, 1968, 1980, 1992, 2004ల్లో పుట్టినవారికి... * వివాదాలు పొంచివుంటాయి. వాటికి దూరంగా ఉండాలి. * మరో విభిన్న మార్గంలో వెళ్లి విజయం కోసం ప్రయత్నించాలి. * ఒత్తిడిని తట్టుకునేలా జాగ్రత్త పడాలి. మేక: 1931, 1943, 1955, 1967, 1979, 1991, 2003, 2015ల్లో పుట్టినవారికి... * వీరికి ఇది నిజంగా శుభ సంవత్సరమే. * ఆర్థిక లాభాలు కలుగుతాయి. * ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం గుర్రం: 1930, 1942, 1954, 1966, 1978, 1990, 2002, 2014ల్లో పుట్టినవారికి... * అనుకోని ధనలాభాలు దగ్గరయ్యే అవకాశం. * వివాహం చేసుకునేందుకు మాత్రం అననుకూలం * పలుమార్లు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పాము: 1929, 1941, 1953, 1965, 1977, 1989, 2001, 2013ల్లో పుట్టినవారికి... * మంచి కెరీర్ అవకాశాలు దగ్గరవుతాయి. * ఫిబ్రవరి, ఆగస్టు మాసాలు చెడ్డ కాలం. * ఆరోగ్యం బాగుంటుంది. డ్రాగన్: 1928, 1940, 1952, 1964, 1976, 1988, 2000, 2012ల్లో పుట్టినవారికి... * ప్రమాదాలు పొంచి వున్నాయి. * పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. * అపార్థాలకు అవకాశం అధికం. కుందేలు: 1927, 1939, 1951, 1963, 1975, 1987, 1999, 2011ల్లో పుట్టినవారికి... * విధుల్లో ప్రమోషన్లకు అవకాశం. * వివాహం చేసుకోవాలంటే అత్యంత అనుకూలం. * అంతఃకలహాలకు దూరంగా ఉండాలి. పెద్దపులి: 1926, 1938, 1950, 1962, 1974, 1986, 1998, 2010ల్లో పుట్టినవారికి... * చైతన్యం నింపుకునేందుకు ఉపకరించే ప్రయాణాలు. * ఉద్వేగాలకు లోనయ్యే ప్రమాదం. * ఆరోగ్యపరమైన చికాకులు. ఎద్దు: 1925, 1937, 1949, 1961, 1973, 1985, 1997, 2009ల్లో పుట్టినవారికి... * పని వాతావరణంలో మార్పులకు అవకాశం. * వివాహాది శుభకార్యాలకు మంచి తరుణం. * నియమిత కాలవ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. పంది: 1923, 1935, 1947, 1959, 1971, 1983, 1995, 2007ల్లో పుట్టినవారికి... * కెరీర్ లో రివార్డులకు అవకాశం. * వాదప్రతివాదాలకు దూరంగా ఉంటే మంచిది. * ఉదర సంబంధ సమస్యలు. కోడిపుంజు: 1933, 1945, 1957, 1969, 1981, 1993, 2005ల్లో పుట్టినవారికి... * ఎదురుచూస్తున్న కొత్త వ్యాపార అవకాశాలు. * ఉద్వేగానికి లోను కారాదు. * పొగ తాగే అలవాటుంటే తక్షణం మానేస్తే మంచిది. కుక్క: 1934, 1946, 1958, 1970, 1982, 1994, 2006ల్లో పుట్టినవారికి... * పొంచివున్న ధన నష్టం. * బరువు తగ్గే అవకాశాలు. * కోపాన్ని అదుపులో పెట్టుకుంటే విజయావకాశాలు.

  • Loading...

More Telugu News