: ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన 'క్లార్క్'


ఈ క్లార్క్.. ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కాదండోయ్, ఇతగాడి పేరు జోర్డాన్ క్లార్క్.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెటర్. ఈ లాంక్ షైర్ ఆల్ రౌండర్ తాజాగా రికార్డు పుటల్లో తనపేరు లిఖించుకున్నాడు. నిన్న యార్క్ షైర్ తో జరిగిన దేశవాళీ మ్యాచ్ లో క్లార్క్ ఓవర్లో ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ ఓవర్ ను భారత సంతతి లెఫ్టార్మ్ స్పిన్నర్ గుర్మాన్ రణ్ ధావా విసిరాడు. విశేషం ఏంటంటే, ఈ సిక్సులన్నీ మిడ్ వికెట్ మీదుగా స్వీప్ చేసినవే. కాగా, ఆరు బంతుల్లో ఆరు సిక్సుల ఘనతను ఇంతకుముందు విండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గారిఫీల్డ్ సోబర్స్ (1968), భారత మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి (1985), దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ హెర్షల్ గిబ్స్ (2007), భారత డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ (2007) సాధించారు.

  • Loading...

More Telugu News