: త్వరలో 'ఆర్ జీవీ' ఆన్ లైన్ థియేటర్... వర్మ సినిమాలు ఇక ఆన్ లైన్లో!


సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో ఆర్ జీవీ పేరిట ఒక ఆన్ లైన్ థియేటర్ ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తన తొలి షార్ట్ ఫిల్మ్ ‘సింగిల్ ఎక్స్’ ను యూట్యూబ్ ద్వారా త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. కేవలం తాను రూపొందించినవి మాత్రమే కాకుండా, తన అభిరుచికి తగ్గట్టుగా ఉండే ఇతరుల సినిమాలను కూడా తన బ్యానర్ పై విడుదల చేస్తానని చెప్పిన ఆయన, ఎలాంటి సినిమాలకు తన ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్నీ స్పష్టం చేశారు. శృంగార, నేర, భయానక మొదలైన అంశాలతో రూపొందించే చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తానని పేర్కొన్న వర్మ, క్రీడలు, భక్తి రస చిత్రాలకు ఏమాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. తనకు క్రీడలు, దేవుడు అంటే ఆసక్తి లేదని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News