: ఎందుకు దీక్ష విరమించానంటే...: ముద్రగడ వివరణ


రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాపుల సంక్షేమం కోసం స్పష్టమైన హామీ వచ్చినందునే తాను ఆమరణ దీక్షను విరమించినట్టు కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నది మాత్రమే తన ప్రధాన డిమాండని, కాపుల మేలు కోసమే దీక్షను ప్రారంభించానని, ఇప్పుడు వారి మేలు కోసమే దీక్ష విరమించానని తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేస్తే ముఖ్యమంత్రికి పాదాభివందనం చేస్తామని, కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటామని అన్నారు. ఏపీ మంత్రులతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనతో పాటు భార్య, బిడ్డలు, ఎందరో కార్యకర్తలు నిరాహార దీక్షకు కూర్చున్నారని, వారంతా కూడా దీక్షను విరమించాలని విన్నవిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించారని, తక్కువ ఆదాయం ఉన్నవారికి మరిన్ని ప్రోత్సాహకాలు, రిజర్వేషన్లు తక్షణం దగ్గర చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News