: వైద్య పరీక్షలకు ఓకే అన్న ముద్రగడ... మరికాసేపట్లో దీక్ష విరమణ?


కాపులకు రిజర్వేషన్ల కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు మెత్తబడ్డారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో సతీసమేతంగా దీక్షకు దిగిన ముద్రగడ నిన్నటి నుంచి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు ముద్రగడతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన చర్చల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ అంగీకరించారు. దీంతో వైద్యులు ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరికాసేపట్లోనే దీక్ష విరమిస్తున్నట్లు ముద్రగడ నుంచి ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News