: ట్విట్టర్ లోనూ ప్రయోగాత్మకంగా టైమ్ లైన్
సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఫేస్ బుక్ లోని టైమ్ లైన్ మాదిరి అల్ గారిథమిక్ టైమ్ లైన్ ను ప్రారంభించడానికి సిద్ధమైంది. వచ్చే వారంలోగా ఈ కొత్త టైమ్ లైన్ ను భారతదేశంతో పాటు మొత్తం 23 దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. సైన్ ఇన్ చేయకపోయినప్పటికీ ఇంతరవకు అందరికీ వ్యక్తిగత ట్వీట్స్ మాత్రమే కనిపించేవి. ఇప్పుడీ టైమ్ లైన్ ద్వారా కథనాలు, సంభాషణలు కూడా చెక్ చేసుకునే అవకాశం కలుగుతుందని ట్విట్టర్ మేనేజర్ పాల్ లాంబార్డ్ తెలిపారు.