: ఇన్ని అబద్ధాలు రాస్తారా? ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తా: సునీల్ దేవ్!
దాదాపు రెండేళ్ల క్రితం మాంచెస్టర్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ని ధోనీ ఫిక్స్ చేశాడని తాను చెప్పినట్టు ఓ హిందీ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించడాన్ని టీమిండియా మాజీ మేనేజర్ సునీల్ దేవ్ తీవ్రంగా ఖండించారు. "ఇదంతా అవాస్తవం. నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆ హిందీ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా" అని దేవ్ వ్యాఖ్యానించాడు. వాతావరణం మబ్బుపట్టి ఉన్న వేళ, తొలుత బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయాన్ని తోసిరాజని ఫీల్డింగ్ ను ఎంచుకోవడం వెనుక మ్యాచ్ ఫిక్స్ అయిందని సునీల్ చెప్పినట్టు ‘సన్ స్టార్’ అనే పత్రిక వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై క్రీడా వర్గాల్లో దుమారం చెలరేగడంతో సునీల్ ఈ ఉదయం స్పందించాడు.