: నిమ్స్ లో తాగునీటికి కటకట... ఇబ్బంది పడుతున్న రోగులు... నిలిచిన డయాలసిస్ సేవలు
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి ఇవాళ తాగునీరు బంద్ అయింది. దాంతో ఓ వైపు రోగులు తీవ్ర ఇబ్బంది పడుతుండగా, మరోవైపు డయాలసిస్ వార్డులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడి పాతభవనంలోని తాజ్ బల్సన్ క్యాంటీన్ ను మూసివేశారు. మంచినీరు లేకపోవడంతో ఏమీ తినలేకపోతున్నామని, పంజాగుట్ట ప్రధాన రహదారి వైపుగా వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని రోగులు, బంధువులు వాపోతున్నారు. మధుమేహ చికిత్స కోసం వచ్చిన వారు కూడా ఇలానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కొరతపై ఆర్ఎంవో మాట్లాడుతూ, తాగునీటిని సరఫరా చేయాలని జలమండలి అధికారులను కోరామన్నారు. అయితే రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా లేదని, తామేం చేయలేమని సమాధానం ఇచ్చారని చెప్పారు.