: ఆ షూలు ధరిస్తే చంద్రుడిపై నడిచినట్టే ఉంటుందట!
ఆ షూలు ధరిస్తే చంద్రుడిపై నడిచిన అనుభూతి కలుగుతుందట. అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఈ తరహా షూలను తయారుచేసింది. భూమితో పోల్చుకుంటే చంద్రుడిపై ఆకర్షణ శక్తి అత్యంత తక్కువగా ఉంటుంది. దాంతో మానవుడు చంద్రుడిపై నడిస్తే కొత్త అనుభూతికి లోనవుతాడు. ఇప్పుడు ఈ కంపెనీ తయారుచేసిన షూలలో అమర్చిన ఎన్ 45 నియోడిమియమ్ అనే ప్రత్యేక అయస్కాంతాలు భూమి ఆకర్షణను నిరోధిస్తాయని చెబుతున్నారు. ఈ అయస్కాంతాల్లో ఎన్ 40, 42, 45 అనే భిన్న రకాల అయస్కాంతాలను ఉపయోగిస్తున్నారు. అందువల్ల చంద్రుడిపై నడిచే వారికి ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఇవి ధరించిన వారికి కూడా అలానే ఉంటుందట. వాటిలో ఎన్ 45 అయస్కాంతం అత్యంత శక్తిమంతమైనదని షూలను రూపొందిస్తున్న పాట్రిక్ జిజిరీ తెలిపారు. ఈ ప్రత్యేక షూలకు '20: 16 మూన్ వాకర్' అని పేరు పెట్టారు.