: నా అసలు పేరు దావూద్ గిలానీ, ఇండియాకు ఎనిమిది సార్లు వచ్చా: విచారణలో డేవిడ్ హెడ్లీ


ముంబైపై ముష్కరులు దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉండి, అమెరికాలో శిక్షను అనుభవిస్తున్న డేవిడ్ హెడ్లీ పై విచారణ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ముంబై కోర్టు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హెడ్లీని విచారిస్తుండగా, తొలి రోజున ఆయన వ్యక్తిగత సమాచారాన్ని న్యాయస్థానం అడిగి తెలుసుకుంది. తన అసలు పేరు దావూద్ గిలానీ అని, 2006లో డేవిడ్ హెడ్లీ అని మార్చుకున్నానని ఆయన తెలిపాడు. పాకిస్థాన్ నుంచి భారత్ కు తాను ఎనిమిది సార్లు వచ్చినట్టు విచారణలో అంగీకరించాడు. లష్కరే తోయిబా ఆధ్వర్యంలోనే దాడులకు ప్లాన్ వేసినట్టు స్పష్టం చేశాడు. ఆ దాడుల తరువాత కూడా తాను 2009లో ఇండియాకు వచ్చానని హెడ్లీ వెల్లడించాడు. పాకిస్థాన్ నుంచి 7 సార్లు, యూఏఈ నుంచి ఓసారి భారత్ కు ప్రయాణించినట్టు వివరించిన హెడ్లీ, తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని భారత్ ముందుంచుతానని, అప్రూవర్ గా సహకరిస్తానని న్యాయమూర్తి ముందు తెలియజేశాడు.

  • Loading...

More Telugu News