: ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు... నలుగురు సజీవ దహనం


రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని అసిత ఫార్మా కంపెనీలో నేటి తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా ఛత్తీస్ గఢ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది. ప్రమాదంపై సరైన సమాధానం ఇవ్వని కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా బాధిత కుటుంబాలు కంపెనీ ముందు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News