: తెలంగాణలో 4.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం!


పీఆర్సీ సిఫార్సుల మేరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 3.14 శాతం డీఏను పెంచుతున్నట్టు కేసీఆర్ సర్కారు ప్రకటించింది. దీని వల్ల మొత్తం 4.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. గత సంవత్సరం జూలై 1 నుంచి ఈ కరవు భత్యం చెల్లించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వాస్తవానికి ఈ నిర్ణయం గతంలోనే వెలువడాల్సి వున్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు, నారాయణఖేడ్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆలస్యమైంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు. విజయ డెయిరీకి నిత్యమూ పాలు అందించే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకరంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News