: మంత్రి కేటీఆర్ కు మున్సిపల్ శాఖ కేటాయింపు


తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు అదనంగా మరో మంత్రిత్వ శాఖను టీసర్కార్ కేటాయించింది. మున్సిపల్ శాఖ బాధ్యతలను కూడా ఆయనే స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మురికి వాడల కష్టాలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్కు తన వద్ద ఉన్న మున్సిపాలిటీ శాఖను అప్పగిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి పార్టీని విజయపథంలో నడిపించిన కేటీఆర్ ను మొత్తం కేబినెట్ అభినందించింది. ఈ సందర్భంగా ఆయనకు మున్సిపల్ శాఖను కూడా ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అనంతరం ఇందుకోసం ఓ ప్రత్యేక జీవోను కూడా జారీ చేసింది. ఇక బడ్జెట్ కేటాయింపులతో సహా పలు కీలక అంశాలపై కేబినేట్ భేటీలో చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సరళి, నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక, మేడారం జాతర, కృష్ణాపుష్కరాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News