: దిగ్విజయ్ తో మాట్లాడేందుకు ‘నో’ అన్న ముద్రగడ!
కాపులను బీసీల్లో చేర్చాలంటూ మూడు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభంకు కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కొన్ని నిమిషాల క్రితం ఫోన్ చేశారు. అయితే, ఆయనతో మాట్లాడేందుకు ముద్రగడ నిరాకరించినట్లు సమాచారం. డిగ్గీతో ఆయన ఎందుకు మాట్లాడలేదన్న అంశానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ముద్రగడ దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు నేతలు ఆమరణ దీక్షలకు దిగడానికి సిద్ధమని ప్రకటించారు.