: సెంట్రల్ వర్సిటీలో మరో కలకలం... రీసెర్చి స్కాలర్ అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో ఇటీవల ఉద్రిక్తంగా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చల్లబడుతున్నాయి. ఈ క్రమంలో నిన్న మరో కలకలం రేగింది. వర్సిటీకి చెందిన రీసెర్చి స్కాలర్ సురేశ్ జోసఫ్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. కేరళకు చెందిన అతడు ఏమయ్యాడోనన్న అనుమానాలు వర్సిటీ అధికారులను కలవరానికి గురి చేస్తున్నాయి. దీనిపై నిన్న వర్సిటీ అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. కొంతకాలంగా జోసఫ్ మానసిక పరిస్థితి సరిగా లేదని హెచ్ సీయూ సీఎంఓ రవీంద్ర కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News