: కొమ్ములు తిరిగిన నియంత...ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు...బయటపడ్డ వీడియో!


బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావడం అంటే ఇదేనేమో...లిబియాలో ఏకఛత్రాధిపత్యం వహించిన కల్నల్ గడాఫీ చివరి ఘడియలకు సంబంధించిన వీడియో బయటపడింది. అక్టోబర్ 2011లో తీసిన ఈ వీడియోను రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మా బయటపెట్టాడు. ఈ పుటేజ్ లో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో గడాఫీ కనబడ్డాడు. రక్తసిక్తమైన అంగీ ధరించి ఉన్న గడాఫీ, తలకు బలమైన గాయంతో, ముఖం పగిలిపోయి...అత్యంత దయనీయంగా ప్రాణభిక్ష పెట్టమని చుట్టూ ఉన్న రెబరల్ ఫైటర్స్ ని వేడుకుంటూ కనిపించాడు. చుట్టూ రెబల్ ఫైటర్స్ నినాదాలు చేస్తుండగా, తలకు తుపాకీ ఆనించిన ఓ రెబల్ ఫైటర్ గడాఫీని అంతమొందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

  • Loading...

More Telugu News