: కోలీవుడ్ నటి హంతకుడు అరెస్టు


తమిళంలో పలు సినిమాల్లో వివిధ పాత్రల్లో సహాయనటిగా ప్రతిభను ప్రదర్శించిన శశిరేఖ మర్డర్ మిస్టరీ వీడింది. పోరూరు పూందమల్లిలో శిశిరేఖ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మదనంతపురానికి చెందిన శషిరేఖ మడిప్పాకంకు చెందిన రమేష్ (32) ను వివాహం చేసుకుంది. మదనంతపురంలో దంపతులిద్దరూ కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో లత్తిక అనే మహిళతో రమేష్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో దంపతుల మధ్య తరచు వివాదం చోటుచేసుకునేది. జనవరి 5న ఇలా జరిగిన ఘర్షణ సందర్భంగా రమేష్ ఆమెను హతమార్చాడు. అనంతరం లత్తికా, వారి స్నేహితులతో కలిసి రమేష్ ఆమె మృతదేహాన్ని కాల్వలో విసిరేసి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయాడు. ఆ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తీగ లాగడంతో డొంకంతా కదిలింది. దీంతో లత్తికా, రమేష్ లను అరెస్టు చేసి నిజం కక్కించారు. ఇప్పుడు వారి స్నేహితులను అరెస్టు చేసే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News