: కేంద మంత్రి స్మృతి ఇరానీకి 'జడ్' కేటగిరి భద్రత


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి 'జడ్' కేటగిరి భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో ఢిల్లీలో మంత్రి కార్యాలయం ఎదుట విద్యార్థులు రోజూ ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వై-కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దాడి చేయవచ్చని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్మృతికి జడ్ కేటగిరీ కల్పించేందుకు నిర్ణయించినట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News