: గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న దానం
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ రెండు స్థానాలు మాత్రమే దక్కించుకోవడం, దారుణంగా పరాజయం పాలైన నేపథ్యంలో అందుకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం నుంచి దానం పార్టీపై లోలోపల అసంతృప్తితో ఉన్నారు. ఆ మధ్య టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ కాంగ్రెస్ లో ఉంటున్నట్టు ప్రకటించారు.