: ఐపీఎల్ వేలానికి వేళాయే!... యువరాజ్, షేన్ వాట్సన్ పైనే అందరి దృష్టి
‘పొట్టి’ క్రికెట్ లో విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ కు సమయం ఆసన్నమైంది. తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అదృశ్యం కాగా... వాటి స్థానంలో రాజ్ కోట్, పూణే జట్లు రంగంలోకి దిగనున్నాయి. తాజా ఐపీఎల్ సీజన్ కు సంబంధించి నేడు బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. మొత్తం 351 మంది క్రికెటర్లు ఈ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుత సీజన్ కు సంబంధించి ఆసీస్ పర్యటనతో మళ్లీ టీమిండియా టీ20 జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ తో పాటు, సిరీస్ ఓడినా సత్తా చాటిన ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వీరిద్దరిని ఎంత భారీ మొత్తాన్నైనా చెల్లించి దక్కించుకునేందుకు అన్ని జట్ల యాజమాన్యాలు వ్యూహాలు రచించుకున్నాయి.