: కేసీఆర్ కు బాలయ్య అభినందనలు... కృష్ణ, మోహన్ బాబు కూడా!
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిన్న రాత్రి పలువురు ప్రముఖులు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న ఫలితాల వెల్లడి పూర్తి కాగానే కేసీఆర్ కు ఫోన్ చేశారు. రికార్డు విజయం సాధించారని ఆయన కేసీఆర్ ను అభినందించారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, మంచు మోహన్ బాబు కూడా కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.