: గర్వం, అహంకారం వద్దు...అణకువ కావాలి: కేసీఆర్


ఇంత పెద్ద విజయం కట్టబెట్టారని నాయకులకు గర్వం రావద్దని కేసీఆర్ చెప్పారు. అహంకారంతో పని చేయవద్దని ఆయన తెలిపారు. ఇప్పుడు అణకువ కావాలని ఆయన సూచించారు. ఈ విజయంతో టీఆర్ఎస్ నేతలపై ప్రజలు భారీ బాధ్యతను మోపారని ఆయన తెలిపారు. అంతా తమకు ఓటు వేసి గెలిపించారని ఆయన చెప్పారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లిస్తామని చెప్పామని ఆయన గుర్తు చేశారు. రాబోయే బడ్జెట్ లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడే అధికారులకు సూచించానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయని వివరించారు. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చానని ఆయన చెప్పారు. పేదల ఎజెండానే టీఆర్ఎస్ ఎజెండాగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News