: జంట నగరాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: కేసీఆర్


గతంలో ఏ పార్టీలకు ఇవ్వని విధంగా వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన జంటనగరాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కష్టించి పని చేసిన అందరికీ ధన్యవాదాలని అన్నారు. విజయం సాధించిన వారందరికీ అభినందనలని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంతవరకు ఏ పార్టీకి 50 స్థానాలను కట్టబెట్టిన దాఖలాలు లేవని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇంత అద్భుతమైన విజయం చేకూర్చిపెట్టారని ఆయన తెలిపారు. ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News