: చెవికోసుకుంటానన్న వ్యాఖ్యలని స్పోర్టివ్ గా తీసుకోవాలి: సీపీఐ నారాయణ


గతంలో తాను టీఆర్ఎస్ వంద స్థానాలు సాధిస్తే చెవికోసుకుంటానని చేసిన వ్యాఖ్యలను స్పోర్టివ్ గా తీసుకోవాలని సీపీఐ నేత నారాయణ కోరారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా సాగుతుండడంపై ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాభిమానం చూరగొందని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యర్థి లేడని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News