: కేటీఆర్ సవాలు చేస్తే...నేను స్పందించా... అంతే!: రేవంత్ రెడ్డి


గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ సవాలు విసిరితే తాను స్పందించానని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆ సవాలుకు తాను ప్రతిస్పందించాను తప్ప, తాను సవాలు చేయలేదని అన్నారు. తాను స్పందించిన తరువాత కేటీఆర్ ఆ సవాలు నుంచి వెనక్కి తగ్గారని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పదవిని ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని నిర్ణయించారని ఆయన చెప్పారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈ ఫలితాలను కేవలం హైదరాబాదు వరకు మాత్రమే పరిమితం చేయాలని ఆయన సూచించారు. ప్రజాభిప్రాయం మారే అవకాశం ఉందని గతంలో చాలా సందర్భాల్లో నిరూపితమైందని ఆయన చెప్పారు. ఈ ఫలితాలతో మిగిలిన పార్టీలను ప్రజలు తిరస్కరించారని భావించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News