: షుమాకర్ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల లేదు: ఫెరారీ మాజీ చీఫ్ లుకా
ఫార్ములా వన్ మాజీ దిగ్గజం షుమాకర్ ఆరోగ్య పరిస్థితిలో ఇంకా ఇటువంటి మెరుగుదల కనిపించలేదని ఫెరారీ మాజీ చీఫ్ లుకా డి మోన్ టేజ్ మోలో వెల్లడించారు. అతని ఆరోగ్యం ఎప్పటిలానే ఉండటం తమను మరింత ఆందోళనకు గురి చేస్తోందని చెప్పారు. షుమాకర్ శరీరం నుంచి ఏ విధమైన స్పందనా పూర్తి స్థాయిలో కనిపించకపోవడం నిజంగా చెడు వార్తేనని పేర్కొన్నారు. ఏడుసార్లు ఫార్ములావన్ టైటిల్ తో చరిత్ర సృష్టించిన చేసిన షుమాకర్ ఇలా కావడం చాలా బాధాకరమని లుకా ఆవేదన వ్యక్తం చేశారు. 2013 డిసెంబర్ లో ఫ్రెంచ్ ఆల్ఫ్ లో స్కీయింగ్ చేస్తుండగా షుమాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో కోమాలోకి జారుకున్న అతను ఆరు నెలలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తరువాత స్విట్జర్లాండ్ లోని ఆయన ఇంటికి తీసుకువచ్చి యథావిధిగా చికిత్స కొనసాగిస్తున్నారు.