: పీజేఆర్ కుమార్తె గెలుపు... ఓటమి అంచున ముఖేష్ గౌడ్ కుమారుడు, కుమార్తె


గ్రేటర్ ఎన్నికల్లో వివిధ పార్టీల సీనియర్ నేతల కుమారులు, కుమార్తెలు పలువురు పోటీ చేసిన సంగతి విదితమే. వీరిలో దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రంగౌడ్, కుమార్తె శిల్పా గౌడ్ ఓటమి అంచున ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గత మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలవగా, ఎంఐఎం మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహదీపట్నం నుంచి పోటీ చేసి గెలుపు సాధించారు.

  • Loading...

More Telugu News