: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు ఊరట!
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే స్వేచ్ఛను హరిస్తున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన న్యాయబృందం తన తీర్పులో అభిప్రాయపడింది. ఆయనకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని సూచించింది. అసాంజే తనపై అత్యాచారం చేశాడని స్వీడన్ కు చెందిన ఒక యువతి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో లండన్ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో అసాంజేను గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రస్తుతం అసాంజే ఈ కేసును ఎదుర్కొంటున్నారు. అయితే, అసాంజేపై యూఎన్ న్యాయబృందం తీర్పును బ్రిటన్, స్వీడన్ దేశాలు తిరస్కరించాయి. కాగా, అమెరికా ప్రభుత్వానికి చెందిన పలు రహస్య పత్రాలను కొన్నేళ్ల క్రితం ‘వికీలీక్స్’ బహిర్గతం చేసింది. దీనిపై యూఎస్ ప్రభుత్వం మండిపడటం తెలిసిందే.