: ‘కత్రినా’ హెయిర్ డై కు భారీ ఖర్చు.. నెటిజన్ల విమర్శలు!
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తలకు రంగు కోసం సుమారు రూ.55 లక్షలు ఖర్చు చేసిందన్న వార్త ఇటీవల హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కత్రినాకు హెయిర్ డై వేసింది లండన్ కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ డేనియల్ గాల్విన్. అంత ఖర్చు పెట్టి హెయిర్ డై వేసుకోవాల్సిన అవసరమేమొచ్చిందంటే.. అభిషేక్ కపూర్ దర్శకత్వంలోని ఫితూర్ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఆదిత్యా రాయ్ కపూర్ సరసన కత్రినా నటిస్తోంది. ఆ చిత్రంలో ఆమె ప్రత్యేకంగా, మరింత అందంగా కనపడేందుకని తలకు అంతఖర్చుపెట్టిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఇంత భారీ మొత్తంలో ఆమె ఖర్చుపెట్టడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. తల రంగు కోసం కత్రినా ఖర్చు పెట్టిన ఆ డబ్బుతో ఎన్నో మంచి పనులు చేయవచ్చని చెప్పడంతో పాటు.. ఏవిధంగా ఖర్చు పెట్టచ్చో కూడా నెటిజన్లు చెప్పారు. అవేంటంటే... * 140 మంది వ్యక్తులకు ఢిల్లీ నుంచి స్విట్లర్జాండ్ కు విమానం టిక్కెట్లు తీసుకోవచ్చు * 6000 ఢిల్లీ మెట్రో కార్డులను మ్యాగ్జిమమ్ లిమిట్ వరకు రీచార్జి చేయించవచ్చు * ఢిల్లీ యూనివర్శిటీలో 350 మంది విద్యార్థులను బీఏ(హిందీ లిటరేచర్) చదివించవచ్చు * బట్టతల ఉన్న 220 మందికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించవచ్చు * ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ధరించినటువంటి ఐదు సూట్లను కత్రినా కుట్టించుకోవచ్చు.. అంటూ వ్యంగ్యంతో కూడిన సలహాలను నెటిజన్లు ఇస్తున్నారు.